కులాంతర వివాహానికి హిమాచల్ లో 75వేల బహుమానం
హర్యానా రాష్ట్రంలో కులాంతర వివాహాలను ఖాప్ పంచాయతీలు నిషేధించాయి. గ్రామీణ ప్రాంతాల్లో కులాల పెద్దల ఆధ్వర్యంలోని వాటినే ఖాప్ పంచాయతీలుగా చెబుతారు. ఎవరైనా కట్టుబాటు తప్పి కులాంతర వివాహం చేసుకుంటే వారికి భారీగా జరిమానా విధిస్తారు ఖాప్ పంచాయతీ పెద్దలు. అంతే కాదు గ్రామ బహిష్కారం, విడిపోవాలని ఆదేశాలు కూడా వెలువడుతుంటాయి.
కానీ, హర్యానా పక్కనున్న హిమాచల్ లో రాష్ట్రంలో మాత్రం కులాంతర వివాహాలు చేసుకునే వారికి జాక్ పాటే. 75వేల బహుమానాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటి వరకూ 25వేలుగా ఉన్న ప్రోత్సాహక బహుమతిని అక్కడి ప్రభుత్వం 75వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.