Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పట్టపగలు రైల్వే స్టేషన్ లో అమ్మాయిని అసభ్యంగా తాకిన మైనర్ అరెస్ట్

ముంబై పరిధిలోని చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ లో శనివారం పగటి పూట, రైలు కోసం వేచి చూస్తున్న అమ్మాయిని అసభ్యంగా తాకుతూ వెళ్లిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్ లోని సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు కాగా, సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అమ్మాయి ప్లాట్ ఫాంపై నిలబడి వుండగా, ఆ పక్కనుంచి వెళుతూ తన కుడి చేత్తో కాళ్ల మధ్య తాకుతూ వెళ్లాడు. ఆ వెంటనే బాలిక అరుస్తూ అతడి వెంటపడింది. ఇక నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ కోర్టుకు పంపించామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. శనివారం నాడు అసలు ఏం జరిగిందన్న వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News