Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డ్రగ్స్ దందాలో రవితేజ పేరు రావడంపై స్పందించిన తల్లి రాజ్యలక్ష్మి

తన కుమారుడు, సినీ హీరో రవితేజ పేరు డ్రగ్స్ దందాలో బయటకు రావడంపై ఆయన తల్లి రాజ్యలక్ష్మి స్పందించారు. తన కుమారుడికి ఎటువంటి చెడు అలవాట్లూ లేవని వెల్లడించారు. డ్రగ్స్ తో రవితేజకు సంబంధాలు లేవని, అతని ఫోన్ నుంచి మరో కుమారుడు భరత్ ఏమైనా మెసేజ్ లు చేశాడన్న అనుమానాలు ఉన్నాయని అన్నారు. తనకు తెలిసి రవికి ఎటువంటి దురలవాట్లూ లేవని స్పష్టం చేసిన ఆమె, రవితేజ సిగరెట్ కూడా తాగడని, తాగేవాళ్లను వారిస్తాడే తప్ప ఎన్నడూ ప్రోత్సహించలేదని తెలిపారు. కాగా, ఈ కేసులో విచారణకు హాజరు కావాలని రవితేజకు సిట్ పోలీసులు నోటీసులు పంపినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News