డౌట్ లేదు.. 'స్పైడర్' పక్కాగా వచ్చేస్తాడట!

ఎన్టీఆర్ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న 'జై లవ కుశ' .. ఫస్టులుక్ తోను .. టీజర్ తోను అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారీ బడ్జెట్ తోను .. భారీ తారాగణంతోను తెరకెక్కుతోన్న ఈ సినిమాను, దసరా కానుకగా సెప్టెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక పూరీ దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తోన్న 'పైసా వసూల్' సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 27న మహేశ్ 'స్పైడర్' విడుదల కానున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు కనుక, ఆలస్యం కావచ్చనే ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమాను ముందుగా అనుకున్న ప్రకారం సెప్టెంబర్ 29న పక్కాగా రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు స్పష్టం చేశారు. ఇక ఈ సినిమాల మధ్య పోటీ ఒక రేంజ్ లో ఉంటుందన్న మాట.  
Go Back to Shorts
Mahesh
Rakul

More Telugu News