బన్నీ సినిమాకి అనూ ఇమ్మాన్యుయేల్ ఖరారైంది!
ఇక ఈ సినిమా కథానాయిక పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలిస్తూ వచ్చారు. అనూ ఇమ్మాన్యుయేల్ ను తీసుకునే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వచ్చాయి. చివరికి ఆ అమ్మాయినే ఖరారు చేశారనేది తాజా సమాచారం. 'మజ్ను' సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అనూ ఇమ్మాన్యుయేల్ .. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ సరసన ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. విశాల్ శేఖర్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.