Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా సినిమా ప్లాప్ అయితే సైలెంట్ గా ఉండను.. ఏడ్చేస్తాను!: విద్యాబాలన్

తాను నటించిన సినిమా ప్లాప్ అయితే సైలెంట్ గా ఉండనని, ఏడ్చేస్తానని చెప్పింది బాలీవుడ్ విలక్షణ నటి విద్యాబాలన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తమ సినిమా ప్లాప్ అయితే, నటీనటులు బాధపడుతుండటం సహజమేనని అన్నారు. అయితే, సినిమా ప్లాప్ అయిందని చెప్పి ఓ గదిలో మౌనంగా కూర్చోనని, ఆ సమయంలో తనతో మాట్లాడేందుకు ఒకరు ఉండాలని చెప్పింది. ముఖ్యంగా తన తల్లిదండ్రులు లేదా తన భర్తతో మాట్లాడతానని, కొంచెం సేపు ఏడ్చిన తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తానని విద్యాబాలన్ చెప్పింది. అయితే, తాను నటించిన సినిమా ప్లాప్ అయితే పడే బాధ ప్రభావాన్ని, తాను నటించబోయే చిత్రంపై ఏమాత్రం చూపించనని చెప్పింది.

More Telugu News