Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గాల్లో గింగిరాలు తిరుగుతూ గిన్నిస్ రికార్డులకు ఎక్కిన జాగ్వార్ ఈ-ఏస్... వీడియో చూడండి!

బ్రిటన్ కేంద్రంగా లగ్జరీ కార్లను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్న జాగ్వార్ సంస్థ తాజా ఎస్యూవీ (స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్) మార్కెట్లోకి రాకుండానే గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. మెర్సిడిస్ బెంజ్ జీఎల్ఏ, ఆడీ క్యూ-3 వాహనాలకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్న జాగ్వార్ ఈ-ఏస్ వాహనం, బ్యారెర్ రోల్ ను చేసి గిన్నిస్ రికార్డులలోకి ఎక్కింది. సంస్థ గతంలో అందించిన ఎఫ్ టైప్ వాహనాన్నే పోలిన ఇది 4.4 మీటర్ల వెడల్పుతో లభిస్తుంది.

గత లగ్జరీ వాహనాల్లో మాదిరిగానే, 10.2 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్ మెంట్ సౌకర్యంతో లభిస్తుంది. 4జీ వైఫ్ హాట్ స్పాట్, 577 లీటర్ల లగేజ్ సామర్థ్యం, ఫోల్డబుల్ రేర్ సీట్లు దీనికి అదనపు ప్రత్యేకత. పెట్రోలు, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ కారు 5.9 సెకన్ల వ్యవధిలో 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుందని సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. త్వరలో మార్కెట్లోకి విడుదలయ్యే ఈ కారు ధర రూ. 23.77 లక్షల వరకూ ఉండనుంది. ఇది చేసిన రేర్ ఫీట్ ను మీరూ చూడవచ్చు.


More Telugu News