ఎన్టీఆర్ రికార్డు సరసన చేరిపోయిన నాని!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్ రికార్డు సరసన చేరిపోయిన నాని!

టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా నాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయనకి సాధ్యమైన వరుస సక్సెస్ లను గురించి చర్చించుకుంటున్నారు. ఆయన తాజా చిత్రం 'నిన్నుకోరి' తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లోను దూసుకుపోతోంది. అమెరికాలో అత్యధికంగా మిలియన్ డాలర్ మూవీస్ ను కలిగిన హీరోల్లో ఇంతవరకూ మహేశ్ బాబు .. ఎన్టీఆర్ .. పవన్ కల్యాణ్ వున్నారు. తాజాగా ఈ జాబితాలో ఎన్టీఆర్ రికార్డు సరసన నాని కూడా చేరిపోయాడు.

 మిలియన్ డాలర్లను సాధించిన దూకుడు .. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు .. 1 నేనొక్కడినే .. ఆగడు .. శ్రీమంతుడు .. బ్రహ్మోత్సవం వంటి ఆరు సినిమాలతో మహేశ్ బాబు మొదటి స్థానంలో వున్నాడు. ఇక బాద్షా .. టెంపర్ .. నాన్నకు ప్రేమతో .. జనతా గ్యారేజ్ వంటి నాలుగు సినిమాలతో ఎన్టీఆర్ రెండవ స్థానంలో వున్నాడు. ఇప్పుడు నాని కూడా ఈ రికార్డు సరసన చేరిపోయాడు. ఆయన చేసిన ఈగ .. భలే భలే మగాడివోయ్ .. నేను లోకల్ .. నిన్నుకోరి సినిమాలతో ఈ స్థానాన్ని అందుకున్నాడు. అత్తారింటికి దారేది .. గోపాల గోపాల .. సర్దార్ గబ్బర్ సింగ్ లతో ఆ తరువాత స్థానంలో పవన్ వున్నాడు. ఈ సినిమాకి ఈ స్థాయి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు నాని ధన్యవాదాలు తెలియజేశాడు      
nani

More Telugu News