సినిమా కబుర్లు ... సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు ... సంక్షిప్త సమాచారం

*  ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటేనే ఏ కాపురమైనా బాగుంటుంది.. అంటోంది చెన్నయ్ బ్యూటీ సమంత. "భార్యాభర్తలలో కూడా ఎవరి వ్యక్తిగత జీవితం వారికి వుంటుంది. దానిని మనం గౌరవించాలి. ఒకరి ఫోన్ ను మరొకరు చెక్ చేసుకోవడం వంటివి బ్యాడ్ హ్యాబిట్. చైతూ, నేనూ అలా అస్సలు చేసుకోం" అని చెప్పింది సమంత.        
*  నందమూరి బాలకృష్ణ నటించే 102వ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ మొదలయ్యాయి. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చిత్రం షూటింగును వచ్చే నెలలో ప్రారంభిస్తారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఇది రాజకీయ అంశాలతో రూపొందుతుంది.
*  వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'ఫిదా' చిత్రానికి సెన్సార్ నుంచి క్లీన్ U సర్టిఫికేట్ లభించింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటించింది.
*  తనీష్, శ్రుతి యుగళ్ జంటగా నటిస్తున్న 'ప్రేమిక' చిత్రం ఆడియోను ఈ నెలలోనే రిలీజ్ చేస్తారు. మహీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెలలో రిలీజ్ చేస్తారు.  
Samanta

More Telugu News