Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాటల మనిషిని కాదంటోన్న అలియా భట్!

బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లో అలియా భట్ కి ఎంతో క్రేజ్ వుంది. తెరపై చలాకీగా కనిపిస్తూ తన గ్లామర్ తో కుర్రకారుకు కుదురులేకుండా చేసింది. ఆమె చేసిన సినిమాలు విడుదలవుతుంటే చాలు థియేటర్స్ దగ్గర కుర్రకారు సందడే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరిన్ని హిట్ సినిమాలు చేస్తూ.. తన స్థానాన్ని పెంచుకోవడానికి ఆమె తన వంతు ప్రయత్నం చేస్తోంది.

 ఒక వైపున కథానాయికగా బిజీగా వున్న ఆమె,  మానవత్వమున్న మనిషిగా తాను చేయవలసిన పనులు రెండు ఉన్నాయని చెప్పింది. ఆడపిల్లల సంక్షేమం కోసం .. వాళ్లు పెద్ద చదువులు చదువుకుని తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలనేదే తన ఆశయమని అంది. అలాగే మూగ జీవాలకు ఆశ్రయం కల్పించాలనే సంకల్పంతో వున్నానని చెప్పింది. ఈ మాటలు ఇప్పుడు చెప్పేసి ఆ తరువాత మరిచిపోయేరకం కాదనీ .. తాను చేతల మనిషినని చెప్పుకొచ్చింది.   
aliabhat

More Telugu News