కోలీవుడ్ నుంచి వస్తోన్న 'బ్రూస్ లీ'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోలీవుడ్ నుంచి వస్తోన్న 'బ్రూస్ లీ'

తమిళ యువ కథానాయకులలో జీవీ ప్రకాశ్ కి ఎంతో క్రేజ్ వుంది. యూత్ లోను .. మాస్ ఆడియన్స్ లోను ఆయనకి మంచి ఫాలోయింగ్ వుంది. వాళ్ల అభిరుచికి తగిన సినిమాలను ఆయన చేస్తూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తమిళంలో 'బ్రూస్ లీ' సినిమా చేశాడు. కృతి కర్బందా కథానాయికగా నటించిన ఈ సినిమా, అక్కడ భారీ వసూళ్లనే రాబట్టింది.

 దాంతో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి డి.వెంకటేశ్ సన్నాహాలు చేస్తున్నారు. ఆల్రెడీ చరణ్ 'బ్రూస్ లీ'ని ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు కనుక, జీవీ ప్రకాశ్ మూవీకి 'నేనే బ్రూస్ లీ' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా, అనువాద కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాను ఇక్కడి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.   
gv prakash kumar

More Telugu News