సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఫిదా' మూవీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఫిదా' మూవీ

ఆనందం .. అనుభూతి కలగలిసినవిగా శేఖర్ కమ్ముల సినిమాలు ఉంటాయి. ఫీల్ తో కూడిన ఆయన సినిమాలను చూడటానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అలాంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'ఫిదా' చిత్రం, ఈ నెల 21వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, క్లీన్ యు సర్టి ఫికేట్ ను సంపాదించుకుందని నిర్మాత దిల్ రాజు చెప్పారు.

ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు .. ఒక మంచి సినిమా వస్తున్నందుకు అభినందించారని అన్నారు. యూత్ తో పాటు కుటుంబసమేతంగా చూడదగినదిగా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. టీజర్ కి .. ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది కనుక, సినిమాకి కూడా మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకంతో ఉన్నామని అన్నారు.          
varun tej
sai pallavi

More Telugu News