విజయ్ మూవీ విషయంలో మురుగదాస్ సెంటిమెంట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయ్ మూవీ విషయంలో మురుగదాస్ సెంటిమెంట్!

తెలుగు .. తమిళ .. హిందీ భాషా ప్రేక్షకుల్లో దర్శకుడిగా మురుగదాస్ కి మంచి క్రేజ్ వుంది. ఆయనతో సినిమాలు చేయడానికి అగ్రకథానాయకులు సైతం వెయిట్ చేస్తుంటారు. అలాంటి మురుగదాస్ .. హీరో విజయ్ తో మూడవ సినిమా చేయడానికి రెడీ అవుతుండటం విశేషం. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'తుపాకి' .. ' కత్తి' సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

దాంతో ఈ ఇద్దరూ మూడవ సినిమాకి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. 'కత్తి' సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు. పాటల పరంగా కూడా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసి .. మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఆ సెంటిమెంట్ తో ఈ సినిమాకి కూడా అనిరుథ్ నే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి అదే సెంటిమెంట్ ను పాటిస్తూ కథానాయికగా సమంతానే తీసుకుంటాడేమో చూడాలి.     
vijay
murugadoos

More Telugu News