మీడియాపై ప్రతాపం చూపిన తేజస్వియాదవ్ భద్రతా సిబ్బంది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీడియాపై ప్రతాపం చూపిన తేజస్వియాదవ్ భద్రతా సిబ్బంది!

బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ భద్రతా సిబ్బంది మీడియాపై తమ ప్రతాపం చూపారు. అవినీతి ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు తేజస్వి యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలతో ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కలుగజేసుకుని మీడియాను నియంత్రించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో భద్రతా సిబ్బంది మీడియా ప్రతినిధులపై చేయిచేసుకునే ప్రయత్నం చేయడంతో దానిని అడ్డుకుని, మీడియా ప్రతినిధులు మూకుమ్మడిగా వారిపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో కొందరు సీనియర్ జర్నలిస్టులు కలుగజేసుకుని, ఇరు వర్గాలను శాంతింపజేశారు. 

More Telugu News