‘ఆప్’ నేతకు బిగ్ బీ అమితాబ్ నోటీసులు.. మ్యూజిక్ వీడియోలో తన తండ్రిని వాడుకోవడంపై అభ్యంతరం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘ఆప్’ నేతకు బిగ్ బీ అమితాబ్ నోటీసులు.. మ్యూజిక్ వీడియోలో తన తండ్రిని వాడుకోవడంపై అభ్యంతరం!

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, కవి అయిన కుమార్ విశ్వాస్‌కు బాలీవుడ్ ప్రముఖ నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కాపీరైట్ నోటీసులు పంపారు. కుమార్ విశ్వాస్ రూపొందించిన ఓ మ్యూజిక్ వీడియోలో తన తండ్రి, ప్రముఖ రచయిత అయిన హరివంశరాయ్ బచ్చన్‌ పేరును వాడుకున్నారు. దీనిని తీవ్రంగా నిరసించిన అమితాబ్ కాపీరైట్ నోటీసులు పంపారు. అమితాబ్ నోటీసులకు స్పందించిన కుమార్ విశ్వాస్ ఆయనకు క్షమాపణలు తెలిపారు. దిగ్గజ కవి హరివంశరాయ్ బచ్చన్‌కు నివాళి తెలిపేందుకే ఆయనను ఉపయోగించుకున్నామని, అందులో మరో ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ఆయనను ఉపయోగించుకోవడం అమితాబ్ తప్పని భావిస్తే వీడియో నుంచి దానిని తొలగిస్తామని కుమార్ తెలిపారు.

More Telugu News