Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి నటుడు దిలీప్ ను తొలగించాం: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి

నటి భావనపై లైంగిక వేధింపులు, దాడి కేసులో అరెస్టయిన నటుడు దిలీప్ ను అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) నుంచి తొలగించినట్టు నిన్న వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘అమ్మ’ ప్రధాన కార్యదర్శి, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మాట్లాడుతూ, ఈ అసోసియేషన్ నుంచి దిలీప్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశామని, ఇటువంటి వ్యక్తులను ‘అమ్మ’ ప్రోత్సహించదని, అందరి కోసం ‘అమ్మ’ పనిచేస్తుందని చెప్పారు. ‘సోదరి భావనకు మొదటి నుంచి మద్దతుగానే నిలిచాం. మా మద్దతు ఆమెకు ఎప్పుడూ ఉంటుంది’ అని మమ్ముట్టి చెప్పారు.     

More Telugu News