ముందే కేక్ కోసేసిన కత్రినా... దగ్గరుండి కోయించిన రణబీర్ కపూర్.. ఇదిగో వీడియో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముందే కేక్ కోసేసిన కత్రినా... దగ్గరుండి కోయించిన రణబీర్ కపూర్.. ఇదిగో వీడియో

కత్రినా కైఫ్ పుట్టిన రోజుకు ముందుగానే ఆమెతో మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ కేక్ కోయించేశాడు. వీరిద్దరూ జగ్గా జాసూస్ సినిమాలో జంటగా నటించగా, ప్రస్తుతం వీరు ఆ సినిమా ప్రచార కార్యక్రమంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కాస్తంత విరామం దొరికింది. ఇంకేముంది, రణబీర్ కు కత్రినా పుట్టిన రోజు గుర్తుకొచ్చేసింది. జూలై 16న ఆమె పుట్టిన రోజు. ఆ తర్వాత మళ్లీ తీరిక దొరకదనుకున్నాడో ఏమోగానీ అప్పటికప్పుడే రణబీర్ మంచి చాక్లెట్ కేక్ తెప్పించేశాడు. హ్యాపీ బర్త్ డే అంటూ రణబీర్ పల్లవి అందుకోగా, కత్రినా కైఫ్ ఉత్సాహంగా ఊగిపోతూ కేక్ కోసింది. ఈ  వీడియోను ఇప్పుడు చాలా మంది లైక్ చేసేస్తున్నారు. మీరూ చూసేయండి.

More Telugu News