నానిపై నిర్మాతలకు ఎందుకంత నమ్మకం?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నానిపై నిర్మాతలకు ఎందుకంత నమ్మకం?

ఓ మాదిరి బడ్జెట్ తో కొత్తగా ఒక సినిమా చేయాలనుకునే దర్శక నిర్మాతలు ముందుగా నాని పేరునే పరిశీలనలోకి తీసుకుంటున్నారు. ఆయన సినిమాకి మినిమమ్ గ్యారెంటీ వసూళ్లు ఉండటమే అందుకు కారణం. నాని ఎంచుకునే కథలను బట్టి .. కథనం విషయంలో ఆయన తీసుకునే శ్రద్ధను బట్టే విజయాలు ఆయన ఖాతాలోకి చేరుతున్నాయి.

 యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను నాని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందువల్లనే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను ఆయన సినిమాలకి మంచి మార్కెట్ వుంది. ఫస్టు వీకెండ్ గా చెప్పుకునే తొలి మూడు రోజుల్లోనే చాలావరకూ పెట్టుబడులు వెనక్కి వచ్చేస్తుండటంతో, బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వెళుతున్నారట. ఈ కారణంగానే సినిమా .. సినిమాకి నానిపై నమ్మకం పెరిగిపోతుండటంతో .. డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. మొత్తానికి నాని అంత లక్కీ ఫెలో కనుచూపుమేరలో కనిపించడం లేదనే చెప్పాలి.
nani

More Telugu News