కాలేజీ యాజమాన్యం వేధింపులతో మ‌రో విద్యార్థి ఆత్మహత్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాలేజీ యాజమాన్యం వేధింపులతో మ‌రో విద్యార్థి ఆత్మహత్య

కాలేజీ యాజమాన్యం వేధింపుల కార‌ణంగా మ‌రో విద్యార్థి బ‌లి అయ్యాడు. ఇటీవ‌లే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని శ్రీ ఇందూ ఇంజినీరింగ్ కళాశాలలో చైతన్య అనే విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నాగులవరంలో బీటెక్ విద్యార్థి సాంబయ్య ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగానే ఆ విద్యార్థి ఈ ఘ‌ట‌న‌కు  పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో త‌మ కుమారుడు బీటెక్ మొద‌టి సంవ‌త్స‌రం చదువుతున్నాడ‌ని అత‌డి త‌ల్లిదండ్రులు చెప్పారు.   

More Telugu News