Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎమ్మెల్యే బొల్లినేనికి షాక్ ఇచ్చిన విజయవాడలోని హోటల్ మినర్వా గ్రాండ్!

విజయవాడలోని కొన్ని హోటళ్లు అపరిశుభ్రతకు, నాణ్యతలేని ఆహార పదార్థాలకు నిలయంగా మారాయి. వీటిలో ప్రముఖ హోటళ్లు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే తింటున్న టిఫిన్ లోనే పురుగులు రావడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు నగరంలోని గ్రాండ్ మినర్వాలో టిఫిన్ చేస్తుండగా... అందులో పురుగులు ఉండటాన్ని ఆయన గమనించారు. ఒక క్షణం విస్తుపోయిన ఆయన... ఆ తర్వాత ఆ విషయాన్ని హోటల్ యాజమాన్యానికి తెలిపారు. అయినా, వారు పట్టించుకోకపోవడంతో... చివరకు ఆహార నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

More Telugu News