ఖైదీ పరిస్థితి విషమంగానే.. పాక్ అధికారుల పరామర్శ
జమ్మూలోని కోట్ బల్వాల్ జైలులో భారత ఖైదీల చేతిలో శుక్రవారం గాయపడ్డ పాక్ ఖైదీ సనావుల్లా ఖాన్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అతడికి చండీగఢ్ లోని పిజిఐ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. చికిత్స తీసుకుంటున్న సనావుల్లాను పాక్ హై కమిషన్ అధికారులు ఈ రోజు సందర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని పాక్ భారత్ ను కోరగా పూర్తి సహకారం అందించడానికి తాము సిద్ధమేనని భారత్ హామీ ఇచ్చింది.