తొమ్మిదేళ్ల క్రితం గ్యాంగ్ రేప్ చేసి నేటికి కూడా వదలట్లేదు... బాధితురాలిపై నాలుగోసారి యాసిడ్ పోసిన దుండగులు

02-07-2017 Sun 11:31 | National
అత్యాచారానికి గురై, ఆపై మూడుసార్లు యాసిడ్ దాడికి గురైన ఆమె మరోసారి బాధితురాలైంది. ఎంతో మానసిక ధైర్యంతో జీవితాన్ని గడుపుతున్న యువతిపై దుండగులు నాలుగోసారి యాసిడ్ దాడికి దిగారు. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, లక్నోలోని తన హాస్టల్ నుంచి మంచినీటి కోసం బయటకు వచ్చిన ఆమెపై రాత్రి 9 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ పోసి పరారయ్యారు. ఆమెపై గతంలో మూడు సార్లు ఇదే తరహా దాడి జరగడంతో, హాస్టల్ వద్ద ఆయుధాలతో కూడిన సెక్యూరిటీని నియమించినా, మరో దాడి జరగడాన్ని పోలీసులు సీరియస్ గా భావిస్తున్నారు.

ప్రస్తుతం కింగ్ జార్జ్ మెడికల్ వర్శిటీలో యాసిడ్ గాయాలకు ఆమె చికిత్స పొందుతోంది. ముఖంపై కుడివైపున యాసిడ్ పడిందని, నిందితులను గుర్తించామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లక్నో అదనపు డీజీపీ అభయ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. కాగా, 2008లో ఆమె తన స్వగ్రామంలో ఉన్నప్పుడు ఆమెపై సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడి జరుగగా, ఆపై 2011లో తొలిసారి, 2013లో మరోసారి యాసిడ్‌ దాడి జరిగింది. ప్రస్తుతం బాధితురాలు లక్నోలో యాసిడ్ బాధితులు నిర్వహిస్తున్న ఓ హోటల్ లో పని చేస్తోంది.

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more