మాంసం తీసుకెళుతున్న వ్యక్తిని హత్య చేసిన కేసులో బీజేపీ నేత అరెస్ట్!

02-07-2017 Sun 10:34 | National
గో సంరక్షణ పేరుతో హత్యలు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మోదీ చేసిన హెచ్చరికల తరువాత, కఠిన చర్యలు మొదలయ్యాయి. గత వారంలో తన కారులో మాంసం తీసుకు వెళుతున్నాడని ఆరోపిస్తూ, ఓ వ్యక్తిపై దాడి చేసి కొట్టి చంపడమే కాకుండా, కారును దహనం చేసిన కేసులో జార్ఖండ్ లోని రామ్ గఢ్ బీజేపీ మీడియా ఇన్ చార్జ్ నిత్యానంద మహతోను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో స్థానిక పార్టీ నేత పప్పూ బెనర్జీ, మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.

గురువారం నాడు అలీముద్దీన్ అనే వ్యక్తిపై దాడి చేసి దారుణంగా కొట్టి, అతని మారుతి వ్యాన్ ను దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నిత్యానంద ప్రోద్బలంతోనే అల్లరిమూక రెచ్చిపోయినట్టు తమ వద్ద వీడియో సాక్ష్యం ఉందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ హత్య ముందుగా ప్లాన్ చేసుకున్నదేనని అనుమానిస్తున్నామని, నిత్యానందకు, అలీముద్దీన్ కూ పాత గొడవలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గో రక్షణ పేరిట హత్య జరిగి వుండవచ్చన్న కోణంలో దర్యాఫ్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more