: టెన్షన్..టెన్షన్... ఎదురెదురుగా ఇండిగో, బీఎస్ఎఫ్ విమానాలు... త్రుటిలో తప్పిన పెను ప్రమాదం!


ఇండిగో, బీఎస్‌ఎఫ్‌ విమాన ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.... ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం శ్రీనగర్‌ నుంచి ఢిల్లీకి వస్తోంది. అదే సమయంలో, అదే మార్గంలో బీఎస్ఎఫ్‌ కు చెందిన విమానం కూడా ఎగురుకుంటూ వస్తోంది. బీఎస్ఎఫ్ విమానంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ మెరిషీ కూడా ఉన్నారు. ఇండిగో విమానం 26 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది.

ఇంతలో 25 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న బీఎస్ఎఫ్ విమానం మరింతపైకి రావడం ప్రారంభించింది. రెండు విమానాలు కంటిచూపుదూరంలోకి వచ్చేయడంతో గుర్తించిన ఇండిగో ఎయిర్ లైన్స్ పైలట్ ఏటీసీని సంప్రదించాడు. వెంటనే బీఎస్ఎఫ్ విమానానికి ప్రమాద సంకేతం పంపారు. దీంతో రెండు విమానాలు అప్రమత్తమయ్యాయి. అయినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో రెండు విమానాలు అతి సమీపం నుంచి దూసుకెళ్లాయి. ఆ విధంగా రెండు విమానాలకు పెను ప్రమాదం తప్పింది. దీనిని ఇండిగో అధికార ప్రతినిధులు ధ్రువీకరించారు.

  • Loading...

More Telugu News