అన్నం పెట్టి.. రెండు వేల రూపాయలు ఇచ్చి.. బాలుడిని సొంత ఊరికి పంపించిన పోలీస్!

29-06-2017 Thu 15:26 | National
హైద‌రాబాద్‌లోని ఎల్బీనగర్‌ రింగ్‌ రోడ్డు వద్ద ఇటీవ‌ల రాత్రి పూట ఓ బాలుడు ఒంట‌రిగా ఏడుస్తూ నిల్చున్నాడు. అంతా ఆ బాలుడిని చూస్తూ వెళ్లిపోతున్నారే త‌ప్పా.. ఏమయింద‌ని, సాయం కావాలా? అని ఎవ‌రూ అడ‌గ‌లేదు. కానీ, ఆ బాలుడిని గుర్తించిన ఓ ఎస్సై మాత్రం త‌నకెందుకులే అని వ‌దిలేయ‌లేదు. ఆ బాలుడికి సాయం చేసి నిజ‌మైన పోలీస్ అనిపించుకున్నారు. ఆ బాలుడిని అక్క‌డ ఎందుకు ఉన్నావ‌ని అడిగారు. ఆ బాలుడు చెప్పిన క‌థ‌కి చలించిపోయిన ఆ పోలీసు వెంట‌నే అత‌డికి అన్నం తినిపించారు. ఆ తర్వాత పుస్తకాలు కొనుక్కోమని రూ. 2వేలు ఇచ్చారు. ఆ బాలుడు ఎక్క‌డినుంచి వ‌చ్చాడో క‌నుక్కొని తిరిగి బస్సు ఎక్కించి పంపించారు. ఆ బాలుడికి ఏదైనా అవసరముంటే ఫోన్‌ చేయమని తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నాగమల్లు చూపిన మాన‌వ‌త్వం ఇది. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేయ‌డంతో ఈ విష‌యం అంద‌రికీ తెలిసింది. ఆ బాలుడి వ‌ద్ద‌కు తాను వెళ్లి ఏమైంద‌ని అడిగాన‌ని, తన అమ్మమ్మ వాళ్లు హైద‌రాబాద్‌లో పూల మొక్కలు అమ్ముకుంటూ ఉంటారని, వాళ్లని చూసేందుకే తాను వినుకొండ అనాథాశ్ర‌మం నుంచి వ‌చ్చాన‌ని త‌న‌తో ఆ 11 ఏళ్ల బాలుడు చెప్పాడ‌ని తెలిపారు. హైద‌రాబాద్ కు వ‌చ్చి చూసేసరికి వాళ్లు వేరే ఊరికి వెళ్లినట్లు తెలిసిందని ఆ బాలుడు త‌న‌తో చెప్పాడ‌ని తెలిపారు. ఆ బాలుడి అమ్మ‌మ్మ కుటుంబ స‌భ్యుల వద్ద  ఫోన్‌ కూడా లేదని త‌న‌తో చెప్పాడ‌ని ఆ పోలీస్ తెలిపారు. ఆ బాలుడి పేరు పులి నాని అని, అత‌డికి తల్లిదండ్రులు లేర‌ని చెప్పారు.

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more