: సీన్ రివర్స్: పామును మింగబోయిన చేప... వీడియో చూడండి!
సాధారణంగా పాము ఇతర జీవులను మింగేస్తుంది. కానీ చిత్రంగా పామును చేప మింగే ప్రయత్నం చేసిన ఘటన ఉత్తరభారతదేశంలోని ఒక కుగ్రామంలో చోటుచేసుకుంది. పైథాస్ మ్యూకస్ జాతికి చెందిన పెద్ద జెర్రిపోతు ఆహారం కోసం చెరువులోని క్యాట్ ఫిష్ జాతికి చెందిన శవడను పట్టుకునే ప్రయత్నం చేసింది. ఇంతలో శవడే జెర్రిపోతును ఒడిసిపట్టేసింది. దీంతో విడిపించుకునేందుకు పాము, మింగేసేందుకు శవడ తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే నీటి బయటకు రావడంతో చేప... చేప నోట్లో ఇరుక్కోవడంతో పాము రెండూ ఈ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాయి. దీనిని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది. ఈ వీడియోను మీరు కూడా చూడండి.