బుమ్రా ‘అసహన’ ట్వీట్ పై స్పందించిన జైపూర్ ట్రాఫిక్ పోలీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బుమ్రా ‘అసహన’ ట్వీట్ పై స్పందించిన జైపూర్ ట్రాఫిక్ పోలీసులు

జైపూర్ పోలీసులు ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని వాహనదారులకు సూచించే క్రమంలో టీమిండియా బౌలర్ బుమ్రా ఫొటోను వాడుకున్న నేపథ్యంలో సదరు బౌలర్ అసహనం వ్యక్తం చేసిన సంగతి విదితమే. ‘డోంట్ వర్రీ.. ట్రాఫిక్ పోలీసులు చేసే తప్పుల గురించి నేను మాట్లాడను’ అని జైపూర్ పోలీసులకు ఆయ‌న‌ కౌంటర్ ఇవ్వ‌డంపై స‌ద‌రు పోలీసులు స్పందించారు. తాము బుమ్రాను ఇబ్బంది పెట్టాల‌నే ఉద్దేశంతో ఆ పోస్ట‌ర్ వేయ‌లేద‌ని, ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌పై అవ‌గాహ‌న కోస‌మే వేశామ‌ని అన్నారు. బుమ్రా సెంటిమెంట్లను, భార‌త‌ క్రికెట్‌ అభిమానుల సెంటిమెంట్లను దెబ్బ తీయాలన్న ఉద్దేశంతో తాము అలా చేయలేదని వివ‌ర‌ణ ఇచ్చారు. నిజానికి బుమ్రా అందరికీ స్ఫూర్తి, ఆదర్శమ‌ని పేర్కొన్నారు.

More Telugu News