ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తల్లి కన్నుమూత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తల్లి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు తల్లి పుల్లమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. అనారోగ్యంతో ఆమె మరణించినట్టు కుటుంబీకులు తెలిపారు. విషయం తెలుసుకున్న కాల్వ హుటాహుటిన స్వగ్రామానికి బయలుదేరి వెళ్లారు. పుల్లమ్మ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి, వరదాపురం సూరి, ప్రభాకర్‌ చౌదరి, బీకే పార్థసారథి తదితరులు సంతాపం ప్రకటించారు. కాగా, పుల్లమ్మ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.

More Telugu News