గోరక్షణ కోసం సుబ్రహ్మణ్యస్వామి సంచలన ప్రతిపాదన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోరక్షణ కోసం సుబ్రహ్మణ్యస్వామి సంచలన ప్రతిపాదన

దేశవ్యాప్తంగా ఉన్న గోశాలలకు ఫండింగ్ కోసం పెట్రోల్ పై సెస్  విధించాలంటూ భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నేత సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి సంచ‌ల‌న ప్రతిపాద‌న చేశారు. నిన్న నిర్వ‌హించిన ఓ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... 1962లో భారత్ పై చైనా దాడి చేసిన ఘ‌ట‌న‌ను గుర్తు చేశారు. ఆ స‌మ‌యంలో రక్షణ నిధి కోసం ఓ అప్పీల్ తీసుకొచ్చామ‌ని, ప్రస్తుతం దేశం ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో ఉందని వ్యాఖ్యానించారు. దేశంలోని హిందువులు, ముస్లింలు అన్ని మతాల వారు ఈ సెస్‌ను చెల్లించాల్సిందేన‌ని ఆయ‌న అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ మాట్లాడుతూ... గోరక్షకుల‌కు సర్టిఫికేషన్ ఇవ్వాలని అన్నారు. గోవుల కోసం అభయారణ్యం కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు.

More Telugu News