కొత్తగూడెంలో బయటపడ్డ అరుదైన సర్పం... పాముకు కాళ్లు... కాలి గోళ్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్తగూడెంలో బయటపడ్డ అరుదైన సర్పం... పాముకు కాళ్లు... కాలి గోళ్లు!

పాముకి కాళ్లు, ఆ కాళ్లకి గోళ్లు ఉండడం ఏంటన్న అనుమానం వచ్చిందా?... కొత్తగూడెంలో పట్టుబడిన అత్యంత పురాతనమైన అరుదైన పాము అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వందల ఏళ్ల క్రితం కనుమరుగయిన జాతికి చెందిన కోబ్రా చుంచుపల్లి మండలం రాంపురానికి చెందిన కొట్ల రాములు అనే రైతు పొలంలో కనిపించింది. ఆరు అడుగుల పొడవైన కోబ్రాను పొలంలో చూసిన రాములు తొలుత ఆందోళనకు గురయ్యాడు.

అయితే ఇది ఇతర పాములకు భిన్నంగా ఉండడంతో ఆసక్తిగా దానిని గురించి ప్రాణధార ట్రస్టు సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఆక్కడికి చేరుకున్న ప్రాణధార ట్రస్ట్‌ అధ్యక్షుడు సంతోష్, ఇతర సిబ్బంది పామును పట్టుకుని డీఎఫ్‌వో రాంబాబుకు అప్పగించారు. వారు పామును పరిశీలించి అరుదైన జాతికి చెందిన కోబ్రాగా దీనిని గుర్తించారు. ఉన్నతాధికారులతో దీని గురించి చర్చించి దీనిని ఏం చేయాలో నిర్ణయిస్తామని వారు తెలిపారు. ఇది వందల ఏళ్ల క్రితం అంతరించిపోయిన అరుదైన సర్పమని వారు తెలిపారు.

More Telugu News