నిరుద్యోగులకు శుభవార్త.. 137 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కారు అనుమతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిరుద్యోగులకు శుభవార్త.. 137 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కారు అనుమతి

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త... రాష్ట్ర సీసీఎల్‌ఏ శాఖలో 109 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు, 13 సీనియర్‌ స్టెనో, 15 జూనియర్‌ స్టెనో ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ తెలంగాణ సర్కారు ఈ రోజు ఉత్తర్వులు జారీచేసింది. రెవెన్యూశాఖలోని ఈ 137 ఉద్యోగాలను తెలంగాణ పబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌(టీఎస్పీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల‌ను టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచ‌నున్నారు.          

More Telugu News