టాప్ పోస్ట్ నుంచి తప్పుకున్న లైంగిక వేధింపుల రాయుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టాప్ పోస్ట్ నుంచి తప్పుకున్న లైంగిక వేధింపుల రాయుడు!

టీవీఎఫ్ (ద వైరల్ ఫీవర్) అనే వెబ్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్న అరుణభ్ కుమార్ తన పదవి నుంచి తప్పుకున్నారు. ఓ మాజీ ఉద్యోగినిని లైంగికంగా వేధించుకుతిన్నట్టు అరుణభ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టీవీఎఫ్ వ్యవస్థాపకుడు కూడా ఇతడే. తన కంటే సంస్థే ఉన్నతమైనదని భావించిన అరుణభ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు. ఈయన స్థానంలో నూతన సీఈవోగా ధావల్ గుసైన్ బాధ్యతలు చేపడతారు.

ఓ మాజీ ఉద్యోగిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అరుణభ్ పై మార్చి 29వ తేదీనే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 2014-16 మధ్య కాలంలో టీవీఎఫ్ లో పనిచేసిన సమయంలో అరుణభ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్నది ఆమె ఆరోపణ. ఇక, ముంబైలోనే వెసోవా పోలీసు స్టేషన్ లోనూ అరుణభ్ పై ఇటువంటిదే మరొక కేసు కూడా ఉంది.




More Telugu News