ప్రేమకు ఓకే చెప్పలేదని దాడి చేసిన రోమియో.. వీడియో చూడండి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమకు ఓకే చెప్పలేదని దాడి చేసిన రోమియో.. వీడియో చూడండి

మహిళలపై అఘాయిత్యాలకు, దాడులకు పెట్టింది పేరైన ఉత్తరప్రదేశ్ లో అటువంటిదే మరో ఘటన పిలిభిత్ ప్రాంతంలో జరిగింది. ఓ ఆకతాయి తనను ప్రేమించాలంటూ ఓ అమ్మాయిని బలవంత పెట్టాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఆ ఆకతాయి, యువతి చెంపపై చేత్తో వరుసగా ఐదు సార్లు బలంగా కొట్టాడు. అక్కడే ఉన్న మరో యువతి వద్దంటూ అరిచింది.

ఇంతలో అక్కడకు మరో యువతి స్కూటర్ పై రావడంతో అతడు తన దాడిని ఆపేశాడు. ఆ తర్వాత కొట్టినందుకు క్షమించాలంటూ ప్రాధేయపడ్డాడు. కాళ్లు పట్టుకోబోయాడు. కానీ, అతడి క్రూరత్వాన్ని కళ్లారా చూసిన ఆ యువతి మళ్లీ నిరాకరించింది. స్కూటర్ పై అక్కడకు వచ్చిన యువతి ఇదంతా గమనించి దాడికి గురైన బాధితురాలి చేయి పట్టుకుని తన వెంట లోపలికి తీసుకెళ్లింది. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు  చేసి దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News