తెలుగు సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే!: సన్నీ లియోన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగు సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే!: సన్నీ లియోన్

బాలీవుడ్ లో బాగా బిజీగా ఉన్న తారల్లో సన్నీలియోన్ ఒకరు. ఒకప్పుడు పోర్న్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ... ఇప్పుడు ఆ రంగం నుంచి పూర్తిగా విరమించుకుంది. తన పూర్తి ఫోకస్ బాలీవుడ్ పైనే ఉంచింది. తెలుగు సినిమాల్లో సైతం సన్నీ మెరిసిన సంగతి తెలిసిందే. 'కరెంట్ తీగ' సినిమాలో ఆమె నటించింది. ఈ సినిమా విడుదలై మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఆమె ఇంతవరకు టాలీవుడ్ లో మరో సినిమా చేయలేదు. ఓ ఇంటర్వ్యూలో ఆమె దీనికి కారణమేంటో తెలిపింది.

'కరెంట్ తీగ' సినిమా తర్వాత తనను ఎంతో మంది దక్షిణాది దర్శకనిర్మాతలు కలిశారని... కొన్ని సినిమాలకు డేట్లు కుదరకపోతే, మరి కొన్ని సినిమాల్లో తన క్యారెక్టర్ నచ్చలేదని సన్నీ తెలిపింది. వాస్తవానికి తెలుగే కాకుండా, దక్షిణాది వారి సినీ నిర్మాణం తనకు బాగా నచ్చుతుందని చెప్పింది. డేట్లు అదనంగా అడగరని, చెప్పిన సమయానికే షూటింగ్ మొదలు పెట్టడం, షూటింగ్ ముగించడం చేస్తారని కితాబిచ్చింది. ఉత్తరాది కంటే దక్షిణాది సినిమాలే సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పింది. డేట్లు అడ్జస్ట్ అయితే తెలుగులో కచ్చితంగా నటిస్తానని తెలిపింది. 

More Telugu News