: రాక్షసానందం: రోడ్డు పక్కన నిద్రపోతున్న వ్యక్తికి నిప్పంటించిన పోకిరీలు!
చెన్నైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిద్రపోతోన్న ఓ వ్యక్తికి కొంతమంది పోకిరీలు నిప్పంటించి, సెల్‌ఫోన్‌లో వీడియో తీసి ఆనందపడ్డారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి తామేదో ఘనకార్యం చేశామన్నట్లు ప్రచారం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే, ఓ పేద వ్యక్తి రాత్రి పూట మద్యం సేవించి, రోడ్డు మీద పడుకున్నాడు. అతడి వద్దకు వచ్చిన కొంత మంది యువకులు ఆయనకు నిప్పంటించి రాక్షసానందం పొందారు. బాధితుడు ఆ నిప్పునుంచి దూరంగా జరగగా, ఆ యువకులంతా వచ్చి అతడిని కాళ్లతో తంతూ, చేతులతో కొడుతూ ఆనందపడ్డారు. చివరకు ఈ వీడియో పోలీసుల వద్దకు వెళ్లడంతో నిందితులని గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.