Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎనిమిదేళ్ల వయసుకే 6.6 అడుగుల ఎత్తు పెరిగాడు!

ఎనిమిదేళ్ల వయసుకే ఏకంగా 6.6 అడుగుల ఎత్తు పెరిగాడు ఈ బుడతడు. మూడో తరగతి చదువుతున్న ఈ కుర్రాడి క్లాస్ మేట్స్ అంతా అతని నడుము ఎత్తు కూడా లేరు. వివరాల్లోకి వెళ్తే, కరణ్ సింగే అనే ఈ పిల్లాడిది ఉత్తరప్రదేశ్ లోని మీరట్ పట్టణం. అతని తల్లి స్వెత్లానా భారత్ తరపున బాస్కెట్ బాల్ ఆడింది.  ఏడు అడుగుల రెండు అంగుళాల పొడవుతో మన దేశంలోనే అత్యంత పొడవైన మహిళగా ఆమె గుర్తింపు పొందింది. కరణ్ తండ్రి మాత్రం అతని కంటే కొంచెం ఎత్తు ఉంటాడు. మరో విషయం ఏమిటంటే ఈ బుడతడు పుట్టినప్పుడే రెండడుగుల పొడవు, ఆరున్నర కిలోల బరువు ఉన్నాడు. దీంతో, పుట్టుకతోనే ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కాడు.

ఈ సందర్భంగా కరణ్ మాట్లాడుతూ, తన తల్లి కంటే ఎక్కువ ఎత్తు పెరగాలని తన తల్లిదండ్రులు కోరుకున్నారని చెప్పాడు. ఇప్పటికే తన సైజుకు తగ్గ దుస్తులు, బూట్లు దొరకడం లేదని తెలిపాడు. చదువుతున్నది మూడో క్లాసే అయినా... కరణ్ షూ సైజు మాత్రం 12.

More Telugu News