: ఏకపక్షంగా కొనసాగుతున్న మ్యాచ్... విజయానికి చేరువలో పాకిస్థాన్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు జరుగుతున్న ఇంగ్లండ్, పాకిస్థాన్ మ్యాచ్‌లో పాక్.. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణిస్తుండడంతో ఈ మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా కొనసాగుతోంది. 212 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 118 పరుగల వద్ద తొలి వికెట్ కోల్పోయిన విషయం తెలిసిందే. పాక్ తన రెండవ వికెట్‌ను 176 పరుగుల వద్ద కోల్పోయింది. పాకిస్థాన్ ఓపెనర్లు అజర్, జమాన్ విజృంభించి ఆడి హాఫ్ సెంచరీలు నమోదు చేసుకున్నారు. అజర్ 76, జమాన్ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యారు. ప్రస్తుతం క్రీజులో బాబర్ 33, హఫీజ్ 10 పరుగులతో ఉన్నారు. పాకిస్థాన్ స్కోరు 35 ఓవర్ల వద్ద రెండు వికెట్ల నష్టానికి 187గా ఉంది. పాక్ విజయానికి మరో 29 పరుగుల దూరంలో ఉంది.