: యువరాజ్ సింగ్ కి సూపర్ పవర్స్ ఉన్నాయి.. చూస్తారా?: కోహ్లీ తీసిన వీడియో ఇదిగో
టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ కి సూపర్ పవర్స్ (అతీంద్రియ శక్తులు) ఉన్నాయట. ఈ విషయాన్ని చెబుతున్నది మరెవరో కాదు... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ విషయం చెబుతూ కోహ్లీ ఒక వీడియో కూడా తీశాడు. దానిని యువీ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ వీడియో వివరాల్లోకి వెళ్తే... తమ ప్రాక్టీసు ముగిసిన తరువాత క్రికెటర్లు ఓవల్ క్రికెట్ గ్రౌండ్ సమీపంలో తాము బస చేసిన హోటల్ కు వెళ్లారు. ఈ సమయంలో యువీ హోటల్ లోపలికి వెళ్తున్న దృశ్యాలను కోహ్లీ వీడియో తీశాడు.
యువీ డోర్ వద్దకు వెళ్లి చేతులు ముందుకు చాచి, వెనక్కి లాగుతాడు... డోర్ లను టచ్ చేయడు. అయినా డోర్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. దీంతో లోపలికి వెళ్లి యువీ మళ్లీ బయటకు తిరిగివచ్చి ఆ డోర్లను దూరం నుంచి తన చేతులతో ముందుకు తోసేలా ఆదేశిస్తాడు. దీంతో ఆ డోర్లు మూసుకుంటాయి. దీంతో తన ప్రదర్శన అయిపోయిందని యువీ బొనటవేలు పైకెత్తి విజయ చిహ్నం చూపిస్తాడు. కాగా, యువరాజ్ సింగ్ ఆటోమెటిక్ సెన్సార్ డోర్ల వద్ద ఈ సరదా యాక్షన్ చేయగా, కోహ్లీ దానిని వీడియో తీశాడు. యువీ దానిని తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేశాడు. మీరు కూడా ఆ వీడియోను చూడండి.