ఇక నటించనంటూ పెట్టిన పోస్టును డిలీట్ చేసిన మంచు మనోజ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇక నటించనంటూ పెట్టిన పోస్టును డిలీట్ చేసిన మంచు మనోజ్!

టాలీవుడ్ యువ నటుడు మంచు మనోజ్ మనసు మార్చుకున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నేటి ఉదయం తన ఫేస్ బుక్ పేజ్ లో ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాతో పాటు, ఇప్పటికే అంగీకరించిన మరో సినిమా పూర్తి చేసిన అనంతరం ఇకపై ఎలాంటి సినిమాల్లో నటించనని ప్రకటిస్తూ ఒక పోస్టు పెట్టాడు. ఇది కాసేపట్లోనే వైరల్ గా మారడంతో ఏమనుకున్నాడో ఏమో కానీ, ఫేస్ బుక్ పేజ్ నుంచి ఆ పోస్టును డిలీట్ చేశాడు.

దీంతో మనోజ్ మనసు మార్చుకున్నాడని, అందుకే ఆ పోస్టును డిలీట్ చేసి ఉంటాడని మనోజ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ పోస్టు డిలీట్ చేసిన మనోజ్ దాని గురించి ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో అతని అకౌంట్ హ్యాక్ అయి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News