Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత... లోనికి దూసుకెళ్లేందుకు కాంట్రాక్టు ఉద్యోగుల యత్నం

తమ ఉద్యోగాలను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ, కాంట్రాక్టు కార్మికులు బేగంపేటలోని ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద నిరసనకు దిగడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉదయం క్యాంపు కార్యాలయానికి దూసుకొచ్చిన కాంట్రాక్టు ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. లోనికి వెళ్లేందుకు అనుమతి లేదని చెబుతూ వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో బేగంపేట రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానన్న హామీ ఇచ్చిన కేసీఆర్, మూడేళ్లయినా దాన్ని నిలబెట్టుకోలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు.

More Telugu News