Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గత కొంత కాలంగా శ్వాస కోశ సమస్యలతో బాధపడిన సినారే!

వృద్ధాప్యం కారణంగా వచ్చిన ఆరోగ్య సమస్యలతో డాక్టర్ సి నారాయణరెడ్డి మరణించారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన వయసు 85 సంవత్సరాలని, గత కొంత కాలంగా ఊపిరితిత్తులు, శ్వాస కోశ సమస్యలతో బాధపడుతూ ఉన్నారని తెలిపారు. ఐదు రోజుల క్రితం ఆయన్ను కేర్ ఆసుపత్రిలో చేర్చామని, కోలుకుంటున్నారని భావించినంతనే, పరిస్థితి విషమించి ఆయన దూరమైనారని వెల్లడించారు. కాగా, కేర్ ఆసుపత్రి నుంచి సినారే మృతదేహాన్ని ఆయన ఇంటికి తరలించారు. తండ్రి మృతదేహాన్ని చూసి విలపిస్తున్న ఆయన కుమార్తెలను ఓదార్చేందుకు బంధువులు ప్రయత్నిస్తున్నారు. పలువురు ప్రముఖులు సినారే బౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు.

More Telugu News