భారీ ఇఫ్తార్ విందు... గిన్నిస్ రికార్డు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీ ఇఫ్తార్ విందు... గిన్నిస్ రికార్డు!

లెబనాన్ లో అజిలోనా అనే స్వచ్ఛంద సంస్థ అందరికీ విందు భోజనం పెట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్‌ ను పురస్కరించుకుని అజిలోనా స్వచ్చంద సంస్థ చిన్నాపెద్దా, ధనికపేద, స్థానికులు, స్థానికేతరులు, అనాధలు, శరణార్థులు అనే తేడా లేకుండా లెబనాన్‌ రాజధాని బీరుట్‌ లో అతిపెద్ద ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఏకకాలంలో సుమారు 5,400 మంది ముస్లింలు ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏక కాలంలో అత్యధిక సంఖ్యలో ఒకే చోట ఇఫ్తార్ విందు నిర్వహించిన సంస్థగా అజిలోనా నిలిచిందని గిన్నిస్ రికార్డు నిర్వాహకులు ప్రకటించి, ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

More Telugu News