శశికళతో కలసి అత్తను అంతమొందించాడు!: తమ్ముడిపై జయ మేనకోడలు దీప సంచలన ఆరోపణలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శశికళతో కలసి అత్తను అంతమొందించాడు!: తమ్ముడిపై జయ మేనకోడలు దీప సంచలన ఆరోపణలు

తన సొంత తమ్ముడు దీపక్ పై జయలలిత మేనకోడలు దీప జయకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తన అనుచరులతో కలిసి పోయేస్ గార్డెన్ కు వెళ్లిన ఆమెను వేదనిలయంలోకి వెళ్లకుండా ఆమె సోదరుడు దీపక్ అడ్డుకున్నాడు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు.

 దీంతో ఆందోళన చేసి, ఇంటికి చేరిన దీప మీడియాతో మాట్లాడుతూ, శశికళతో కుమ్మక్కై తన సోదరుడే అత్త (జయలలిత) ను అంతమొందించాడని, ఇప్పుడు దినకరన్ తో చేతులు కలిపి తనను అంతమొందించాలనుకుంటున్నాడని ఆరోపించారు. పొయేస్  గార్డెన్ కు రావాలని ఫోన్ చేసిన దీపక్ తాను అక్కడికి చేరుకున్న అనంతరం తనను అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనిపై దీపక్ సమాధానమిస్తూ, తన సోదరి చీప్ పబ్లిసిటీకి పాకులాడుతోందని ఎద్దేవా చేశాడు.

More Telugu News