Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అల్లు అర్జున్ తెలుగు మైఖేల్ జాక్సన్: పూజా హెగ్డే

అల్లు అర్జున్ తెలుగు మైఖేల్ జాక్సన్ అని పూజా హెగ్డే కితాబునిచ్చింది. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగిన డీజే ఆడియో వేడుకలో మాట్లాడుతూ, అల్లు అర్జున్ నుంచి నటనలో టిప్స్ నేర్చుకున్నానని చెప్పింది. సినిమాలో అల్లు అర్జున్ తో డాన్స్ చేసినప్పుడు చూశానని, ఆయన చాలా అద్భుతమైన డాన్సర్ అని తెలిపింది. ఈ సినిమాలో తన ఫేవరేట్ సాంగ్స్ సూపర్ హిట్ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడని తెలిపింది. తనకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్ లకు ధన్యవాదాలు తెలిపింది. తెలుగు అభిమానులు చాలా ఎనర్జిటిక్ అండ్ సూపర్ అని అభినందించింది. 

More Telugu News