ప్రపంచాన్ని నాశనం చేసేది నేను కాదు... వినాశనకారి ట్రంపే: కిమ్ జాంగ్ కౌంటర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రపంచాన్ని నాశనం చేసేది నేను కాదు... వినాశనకారి ట్రంపే: కిమ్ జాంగ్ కౌంటర్

ప్రపంచ వినాశనకారిగా తనను సంబోధిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కౌంటర్ ఇచ్చాడు. పారిస్ పర్యావరణ ఒప్పందాన్ని ట్రంప్ ఉల్లంఘించడాన్ని కిమ్ తప్పుబట్టాడు. 194 దేశాలు సంతకాలు చేసిన ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా బయటకు రావడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. పప్రంచ వినాశనకారిని తాను కాదని... అమెరికా అధ్యక్షుడేనని అన్నారు. ప్రపంచ పర్యావరణాన్ని రక్షించడానికి ముందుకు రాని ట్రంప్... తన గురించి విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రపంచాన్ని కాలుష్యం కోరల నుంచి కాపాడటానికి 194 దేశాలు సంతకం చేస్తే... ట్రంప్ మాత్రం వెనకడుగు వేశాడని... ఆయన సెల్ఫిష్ అంటూ మండిపడ్డారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆయన అహంకారాన్ని సూచిస్తోందని అన్నారు.

More Telugu News