: దంగల్ సినిమా నాకు తెగ నచ్చేసింది!: మోదీతో చైనా అధ్యక్షుడు


అమీర్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'దంగల్' చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు తెగ నచ్చేసిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా భారత ప్రధాని మోదీతో చెప్పారు. ఇలాంటి సినిమాలు మరిన్ని చైనాలో రిలీజ్ కావాలన్న ఆకాంక్షను మోదీతో వ్యక్తం చేశారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భాగంగా మోదీ, జిన్ పింగ్ ల చర్చల మధ్య ఈ ఆసక్తికర సంభాషణ జరిగింది.

చైనాలో గత నెలలో 'దంగల్' విడుదలైంది. అక్కడ 9 వేల థియేటర్లలో రిలీజైన ఈ సినిమా... చైనీస్, ఇంగ్లీషేతర భాషల సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. చైనాలో ఏడాదికి 34 విదేశీ చిత్రాలు విడుదల అవుతాయి. మొన్నటిదాకా రెండు ఇండియన్ సినిమాల విడుదలకు మాత్రమే అనుమతి ఉండేది. ఇప్పుడు ఈ సంఖ్యను రెండు నుంచి నాలుగుకు పెంచింది చైనా. 

  • Loading...

More Telugu News