Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇదో వింత....పాముతో యువతి ప్రేమ వివాహం... ముహూర్తానికి పుట్టలోంచి బయటకు రాని వరుడు!

ఒడిశాలో చిత్రమైన ప్రేమ వివాహం జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే... ఒడిశాలోని ఖుర్ధ్ జల్లాలోని అతాల్ గ్రామంలో బిమ్‌ బాలా అనే మహిళ నివసిస్తోంది. ఆమె ఇంట్లో ఎప్పటిదో పాముల పుట్ట ఒకటి ఉంది. ఆ పుట్టలో ఒక పాము నివాసం ఉంటోంది. ఆ పాము ప్రతి రోజూ బయటకు రావడం, బిమ్ బాలా పోసిన పాలు తాగడం, ఆ తరువాత ఆమె ఒడిలో కొంత సేపు సేదదీరడం, ఆ తరువాత మళ్లీ పుట్టలోకి వెళ్లిపోవడం చేస్తోంది. పామును దేవుడిగా ఆరాధించే నమ్మకాలు ఉండడంతో తమది జన్మ జన్మల బంధమని బిమ్‌ బాలా భావించింది. దీంతో కొన్నాళ్టికి పాముతో ప్రేమలో పడింది. దీంతో పామునే వివాహం చేసుకోవాలని నిర్ణయించింది.

చిత్రంగా ఆమె నిర్ణయానికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేశారు. అంతే కాకుండా పాము చాలా కాలంగా బిమ్ బాలా పాలు తాగి సేదదీరుతున్నా...ఏనాడూ కరిచే ప్రయత్నం చేయలేదని చెబుతున్నారు. అందుకే పాము కూడా ఆమెను ప్రేమిస్తోందని భావిస్తున్నామని అన్నారు. దీంతో బిమ్ బాలాకు, పాముకు వివాహ ముహూర్తం నిర్ణయించారు. అయితే ముహూర్తం సమయానికి వరుడు (పాము) మాత్రం పుట్టలోంచి బయటకు రాకపోవడంతో పాము బొమ్మతో వివాహ తంతు కానిచ్చేశారు. ఈ చిత్రమైన వివాహానికి 1500 మంది హాజరుకావడం విశేషం. 

More Telugu News