దినకరన్ కు షాక్ ఇచ్చిన కోర్టు.. ఫెరా కేసులో అభియోగాల ఖరారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దినకరన్ కు షాక్ ఇచ్చిన కోర్టు.. ఫెరా కేసులో అభియోగాల ఖరారు!

లంచం ఇవ్వజూపిన కేసులో తీహార్ జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ నేడు ఎగ్మోర్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరయ్యారు. 2001లో ఈడీ ఆయనపై నమోదు చేసిన ఫెరా కేసు విచారణ నేపథ్యంలో ఆయన కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా దినకరన్ పై నమోదైన అభియోగాలను జడ్జి వినిపించగా... దినకరన్ వాటిని ఖండించారు.

 అయితే దినకరన్ విన్నపాలను పట్టించుకోని జడ్జి... అభియోగాలను ఖరారు చేశారు.  బార్క్లే బ్యాంక్ ద్వారా డిప్పర్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీకి అక్రమంగా తరలించిన 1.04 కోట్ల డాలర్లకు సంబంధించిన కేసులోని అభియోగాలను జడ్జి ఖరారు చేశారు. దీనికితోడు, 36.36 కోట్ల డాలర్లు, లక్ష పౌండ్ల ధనాన్ని యూకేలోని ఓ స్టార్ హోటల్ కు అక్రమ మార్గాల ద్వారా తరలించారనే కేసులో ఈ రోజు ఆయనపై కొత్త అభియోగాలు నమోదు చేశారు. మరోవైపు, కేసు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపును ఇవ్వాలని దినకరన్ వేసిన పిటిషన్ ను కూడా జడ్జి కొట్టివేశారు.

More Telugu News