Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘రాబ్తా కథ కేసు’లో వెనక్కి తగ్గిన అల్లు అరవింద్.. రేపు విడుదల కానున్న బాలీవుడ్ సినిమా!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతిసనన్ జంటగా నటించిన బాలీవుడ్ సినిమా ‘రాబ్తా’ ట్రైల‌ర్‌ను చూసిన త‌రువాత నిర్మాత అల్లు అరవింద్ ఆ సినిమా ‘మ‌గ‌ధీర’ సినిమాకు కాపీ అంటూ రాబ్తా యూనిట్ పై కేసు వేసిన విష‌యం తెలిసిందే. అయితే, అల్లు అరవింద్ ఈ విష‌యంపై వెన‌క్కుత‌గ్గారు. రాబ్తా యూనిట్ వాదనతో సంతృప్తి చెందిన న్యాయ‌స్థానం వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అల్లు అర‌వింద్ తాను వేసిన కేసును ఈ రోజు ఉదయం వెన‌క్కి తీసుకున్నారు.

దీంతో రేపు రాబ్తా రిలీజ్ కానుంది. దినేష్ విజన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలోని క‌థ  తెలుగు సినిమా మగధీర క‌థ‌కు ద‌గ్గ‌ర‌గా ఉంద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. మ‌గ‌ధీర‌లోలాగే హీరో, హీరోయిన్లు వందల ఏళ్ల కింద‌ ప్రేమించుకోవటం,  తిరిగి జన్మించి త‌మ ప్రేమ‌ను నిలుపుకోవ‌డంతో పాటు ఈ బాలీవుడ్ మూవీలో హీరో వంద మందితో ఫైటింగ్ చేయ‌డం వంటి సీన్లు కనిపించడం ఆ ఆరోప‌ణ‌లకు బ‌లం చేకూర్చాయి. చివ‌రికి అల్లు అరవింద్ కేసు వెన‌క్కి తీసుకోవ‌డంతో లైన్ క్లియ‌ర్ అయింది.
 

More Telugu News