Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాలిఫోర్నియాలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు.. పరిస్థితి విషమం!

అమెరికాలోని కాలిఫోర్నియాలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు జరిగాయి. సంగారెడ్డి జిల్లాకు చెందిన ముబీన్ అనే విద్యార్థి 2015 ఫిబ్రవరిలో మాస్టర్స్ విద్యను అభ్యసించేందుకు అక్కడకు వెళ్లాడు. రెండు నెలల క్రితం అతని కోర్స్ పూర్తయింది. ప్రస్తుతం ఓ స్టోర్ లో అతను టెంపరరీ జాబ్ చేస్తున్నాడు. ముబీన్ షాపులో ఉండగా కొందరు నల్లజాతీయులు అక్కడకు వచ్చారు. ఓ విషయానికి సంబంధించి వారికి, ముబీన్ కు మధ్య కొంచెం వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో, ముబీన్ పై వారు కాల్పులు జరిపారు. బుల్లెట్ అతని కడుపులోకి దూసుకుపోయింది.

ఘటన జరిగిన వెంటనే అతడిని ఈడెన్ మెడికల్ సెంటర్ కు తరలించారు. షికాగోలో ఉన్న అతని బంధువులు కాలిఫోర్నియాకు చేరుకుని, ముబీన్ వద్ద ఉన్నారు. ఈ సందర్భంగా చికిత్స అందిస్తున్న వైద్యులు మాట్లాడుతూ, బుల్లెట్ వల్ల లివర్ బాగా డ్యామేజ్ అయిందని తెలిపారు. ముబీన్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. 

More Telugu News